నేడు 'ఆయూష్ రాక్స్టార్ల' స్మారక స్టాంపుల విడుదల దేశంలో సంప్రదాయ వైద్య రంగం, యోగాలో విశేష కృషి చేసిన వారిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఆయుర్వేదం, యోగా, న్యాచురోపథి, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయూష్)లో విశిష్ట సేవలందించిన 12 మంది ప్రముఖుల స్మారకార్థం పోస్టల్ స్టాంపులను విడుదల చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయూష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రత్యేక కమిటీ...
ఆయూష్ విభాగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు దేశంలో సరైన గుర్తింపు లభించలేదని.. వారిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించింది మంత్రిత్వ శాఖ. 1850 నుంచి ఆయూష్ విభాగాల్లో విశేష సేవలందించిన వారి పేర్లను ఎంపిక చేసేందుకు పరిశోధన మండళ్లు, జాతీయ సంస్థలకు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సు చేసిన 30 మందిలో విసృత చర్చల అనంతరం 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
12 మందిలో గాంధీ వైద్యుడు
ఈ 12 మంది ఆయూష్ మాస్టర్లలో మహాత్మా గాంధీకి వ్యక్తిగత వైద్యుడు దిన్షా మెహతా ఉన్నారు. 1902లో లఖ్నవూలో వైద్య పాఠశాలను నెలకొల్పిన హకీమ్ మహ్మద్ అబ్దుల్ అజిజ్ లఖ్నావి, ఆధునిక ప్రపంచానికి యోగా మరింత చేరువయ్యేలా చేసిన స్వామి కువలయనంద, యునాని వైద్యంలో విశేష సేవలందించిన హకీమ్ మహమ్మద్ కబీరుద్దీన్ ఉన్నారు.
ఇదీ చూడండి:'ఆరోగ్యకర జీవితానికి ఫిట్నెస్ తప్పనిసరి షరతు'