తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జూన్​ 22న ఆర్థిక వేత్తలతో మోదీ భేటీ - growth

ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో జూన్​ 22న ప్రధాని నరేంద్రమోదీ భేటీ కానున్నారు. అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి కావాల్సిన ఆర్థిక విధానాలను రూపొందించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.

నీతి ఆయోగ్ సమావేశం

By

Published : Jun 19, 2019, 6:05 AM IST

Updated : Jun 19, 2019, 8:01 AM IST

ఆర్థిక వేత్తలతో మోదీ భేటీ

ఆర్థిక విధానాల రూపకల్పనకు వివిధ రంగాల నిపుణులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22న భేటీ కానున్నారు. అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక వేత్తలతో చర్చించనున్నారు.

ప్రభుత్వ ప్రణాళిక మండలి నిర్వహించే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, వివిధ రంగాల్లో నిపుణులు, వ్యాపార వేత్తలు హాజరవనున్నట్టు సమాచారం.

2018-19 నాలుగో త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతంతో ఐదేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ఏడాది మొత్తం చూసినా 6.8 శాతంతో ఐదేళ్ల కనిష్ఠాన్ని తాకింది. వ్యవసాయం, తయారీ రంగాల వెనుకబాటుతోనే ఈ పరిస్థితి నెలకొందని కేంద్ర గణాంక కార్యాలయం(సీఎస్​ఓ) తెలిపింది. నిరుద్యోగ శాతం కూడా 6.1గా నమోదై 45 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుందని సీఎస్​ఓ వెల్లడించింది.

వచ్చే ఐదేళ్లలో పరిస్థితులను చక్కబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా జులై 5న ప్రవేశపెట్టే బడ్జెట్​లో చేర్చాల్సిన అంశాలపైనా సమాలోచనలు చేయనున్నారు.

ఇదీ చూడండి: ఐదేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

Last Updated : Jun 19, 2019, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details