పాకిస్థాన్‌తో 1971 జరిగిన యుద్ధంలో విజయానికి యాభై ఏళ్లు నిండిన నేపథ్యంలో దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. యుద్ధంలో మరణించిన జవానులకు సంఘీభావంగా 'స్వర్ణ విజయ జ్యోతి'ని వెలిగించనున్నారు. యుద్ధ స్మారకం వద్ద మోదీకి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానం పలుకుతారని ఆ శాఖ వెల్లడించింది. సైనికులకు మోదీతో పాటు, తిదళాధిపతి, త్రివిధ దళాల అధిపతులు నివాళులు అర్పిస్తారని పేర్కొంది.
ఈ విజయ జ్యోతులను దేశనలుమూలలకు తీసుకెళ్లేలా రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 1971 యుద్ధంలో పాల్గొని పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు అందుకున్న జవానుల గ్రామాలకు సైతం వీటిని పంపించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.