తెలంగాణ

telangana

ETV Bharat / bharat

24న గ్రామ పంచాయతీ ప్రతినిధులతో మోదీ మాటామంతి

ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్​ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదే సందర్భంగా ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్​లను ఆయన ఆవిష్కరించనున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివాస సముదాయాల భూసరిహద్దుల సర్వే కోసం 'స్వమిత్వ పథకాన్ని' ప్రారంభించనున్నారు.

PM to interact with village panchayats via video link on Friday
24న గ్రామ పంచాయతీ ప్రతినిధులతో మోదీ మాటామంతి

By

Published : Apr 23, 2020, 8:10 AM IST

ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్​ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గ్రామ పంచాయతీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా నివారణ చర్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతపై పంచాయతీ ప్రతినిధులతో చర్చించనున్నారు ప్రధాని.

24న గ్రామ పంచాయతీ ప్రతినిధులతో మోదీ మాటామంతి
24న గ్రామ పంచాయతీ ప్రతినిధులతో మోదీ మాటామంతి

ఏకీకృత పోర్టల్​

ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్​ పోర్టల్​, మొబైల్​ యాప్​లను మోదీ ఆవిష్కరించనున్నారు. పంచాయతీలు... తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ను స్వయంగా తయారు చేసి అమలు చేసేందుకుగాను పంచాయతీ రాజ్​ మంత్రిత్వశాఖ 'సింగిల్ ఇంటర్​ఫేస్​'తో ఈ ఏకీకృత పోర్టల్​ను రూపొందించింది.

స్వమిత్వ పథకం

ఇదే సందర్భంగా... గ్రామీణ ప్రాంతాల్లో నివాస సముదాయాల భూసరిహద్దుల సర్వే కోసం 'స్వమిత్వ పథకాన్ని' ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించే ఓ గొప్ప ప్రయత్నమని ప్రధాని ట్వీట్ చేశారు.

పంచాయతీ రాజ్​ మంత్రిత్వశాఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం, రాష్ట్ర రెవెన్యూ శాఖ, సర్వే ఆఫ్ ఇండియాల సహకారంతో... డ్రోన్​ సాంకేతిక పరిజ్ఞానం- తాజా సర్వే పద్ధతులను ఉపయోగించి గ్రామీణ భారతంలోని భూమిని గుర్తిస్తారు.

ప్రోత్సాహకాలు...

ఈ పంచాయతీరాజ్​ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రజా వస్తు, సేవల పంపిణీకి, గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన పంచాయతీలకు ఏటా ప్రోత్సాహకాలను అందిస్తుంటుంది పంచాయతీరాజ్​ మంత్రిత్వశాఖ. ఈ ఏడాది 'నానాజీ దేశ్​ముఖ్​ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్'​, 'చైల్డ్​ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు', 'గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక' అవార్డులను ఖరారు చేసింది.

ఇదీ చూడండి:వైద్య సిబ్బంది భద్రతలో రాజీ పడేది లేదు: మోదీ

ABOUT THE AUTHOR

...view details