ఈడీఎఫ్‌సీ(ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్)లోని నూతన భూపుర్- నూతన ఖుర్జ భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇదే కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని ఈడీఎఫ్సీకి చెందిన కార్యకలాపాల నియంత్రణ కేంద్రాన్ని(ఓసీసీ) కూడా ప్రధాని ప్రారంభిస్తారని స్పష్టం చేసింది. ఈ వేడుకలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ తదితరులు పాల్గొంటారని పేర్కొంది.
పలు అభివృద్ధి పనులకు నేడు మోదీ శ్రీకారం - ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం ఈడీఎఫ్‌సీలోని నూతన భూపుర్-నూతన ఖుర్జ భాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ 351 కీలోమీటర్ల పొడవు గల కారిడర్‌ను వర్చువల్ విధానంలో మోదీ ఆవిష్కరిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఈడీఎఫ్‌సీ కారిడర్ భాగాన్ని ప్రారంభించనున్న మోదీ
పంజాబ్‌లోని లుథియానా నుంచి హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ మీదుగా బంగాల్లోని ధన్‌కుని వరకు ఈ 1,856కిలో మీటర్ల ఈడీఎఫ్‌సీని నిర్మిస్తున్నారు. అందులో నూతన భూపుర్-నూతన ఖర్జు విభాగం పొడవు 351 కిలోమీటర్లు. దీని వ్యయం రూ, 5,750కోట్లు. ఇది అందుబాటులోకి వస్తే.. స్థానిక పరిశ్రమలకు మేలు జరగనుంది. ఇది రైల్వేకు బాగా ఉపయోగపడుతుంది.
ఇదీ చూడండి:-'కిసాన్ రైలుతో రైతు సాధికారత'
Last Updated : Dec 29, 2020, 8:02 AM IST