రెండేళ్లకు ఓసారి నిర్వహించే డిఫెన్స్ ఎక్స్పోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు లఖ్నవూలో ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొననున్నాయి.
విమానాల రాకపోకలపై ఆంక్షలు..

డిఫెన్స్ ఎక్స్పో కారణంగా దాదాపు 90 విమానాల రాకపోకలు ప్రభావితం కానున్నాయి. డిఫెన్స్ ఎక్స్పో సమయంలో గంటకు 2,700 కిలోమీటర్ల వేగంతో యుద్ధవిమానాలు ప్రయాణించనుండటం వల్ల విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
భారత్కు విక్రయించాలని భావిస్తున్న ఫ్రాన్స్, అమెరికాకు చెందిన యుద్ధవిమానాలు కూడా ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు సుఖోయ్30 ఎంకేఐ, జాగ్వార్, చినూక్, చీతా హెలికాప్టర్లు కూడా ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.