అండమాన్ ద్వీప సమూహానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే చెన్నై-అండమాన్ నికోబార్ సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ సహా మరో ఏడు ద్వీపాలకు సమాచార వ్యవస్థను రూపొందించారు. తీరంలో ఉన్న ద్వీపాలకు టెలికమ్యునికేషన్ సిగ్నళ్లు పంపించే విధంగా సముద్రగర్భంలో సబ్మెరైన్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.