ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఆందోళనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని లఖ్‌నవూలో ఆవిష్కరించారు. అనంతరం వాజ్‌పేయీ వైద్య వర్సిటీకి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని ప్రజలు హక్కుల గురించే కాదు.. తమ బాధ్యతలను గుర్తెరగాలని సూచించారు.
ఆస్తుల ధ్వంసం మీ హక్కా?: 'పౌర' నిరసనకారులకు మోదీ ప్రశ్న - మోదీ తాజా వార్తలు
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని ప్రధాన నరేంద్ర మోదీ లఖ్‌నవూలో ఆవిష్కరించారు. అటల్ జయంతిని పురస్కరించుకొని వాజ్‌పేయీ వైద్య విశ్వవిద్యాలయానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఏఏపై చెలరేగిన హింసపైనా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తోంది. ఇప్పటివరకూ హక్కులపై దృష్టి సారించాం. ఇప్పుడు మన కర్తవ్యాలు, బాధ్యతలపై కూడా దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల సందర్భంగా హింసకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. తమ చర్య సరైందేనా అని వారు ఒకసారి ఆలోచించాలి. వారు నష్టం కలిగించినవి, దహనం చేసినవి వారి పిల్లలకు ఉపయోగపడవా...? తప్పుడు ప్రచారాలు నమ్మి హింసను కలిగించే వారికి చెబుతున్నా....రహదారులు, రవాణా ప్రజలహక్కు. వాటిని కాపాడటం, పరిశుభ్రంగా ఉంచటం కూడా వారి బాధ్యతే.
- నరేంద్ర మోదీ, ప్రధాని
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: వాజ్‌పేయీ విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ