తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎమర్జెన్సీ' వీరులకు మోదీ, షా సెల్యూట్​ - నరేంద్ర మోదీ

1975 నాటి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, భాజపా నేతలు సహా వివిధ పార్టీల నేతలు స్మరించుకున్నారు. రాచరిక ఆలోచనల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారికి సెల్యూట్​ అంటూ మోదీ ట్వీట్​ చేశారు. అటు ఐదేళ్లుగా దేశంలో సూపర్​ ఎమర్జెన్సీ నడుస్తోందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ భాజపాపై విమర్శలు గుప్పించారు.

ప్రధాని మోదీ, అమిత్​ షా

By

Published : Jun 25, 2019, 12:43 PM IST

1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)కి వ్యతిరేకంగా పోరాడిన మహనీయులకు జోహార్లు అంటూ ట్వీట్​ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1975 జూన్​ 25న మొదలైన అప్పటి ఎమర్జెన్సీ మార్చి 21 వరకు కొనసాగింది. అత్యవసర పరిస్థితి మొదలైన రోజుకు నేటితో 44ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీని నిరసిస్తూ పోరాడిన వారిని స్మరించుకున్నారు ప్రధాని మోదీ. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

" ధైర్యంగా, వీరోచితంగా ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాడిన మహానుభావులందరికీ దేశం సెల్యూట్​ చేస్తోంది. రాచరిక ఆలోచనల నుంచి ప్రజాస్వామ్యాన్ని వారు విజయవంతంగా కాపాడారు"-- ప్రధాని మోదీ ట్వీట్​

చీకటి రోజులు

ఎమర్జెన్సీ కాలం దేశానికి చీకటిరోజులని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్​ చేశారు.

జగత్​ ప్రకాశ్​ నడ్డా ట్వీట్​

" 1975.. ఇదే రోజు.. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్​ ఖూనీ చేసింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు నేతృత్వం వహించిన వేలాది భాజపా, ఆర్​ఎస్ఎస్​ హీరోలను దేశం కీర్తిస్తోంది" -- జేపీ నడ్డా ట్వీట్​

దేశ చరిత్రలో అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయమని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ట్వీట్​ చేశారు.

హక్కులకు విఘాతం

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ట్వీట్​

అత్యవసర పరిస్థితి కాలంలో పౌరుల, వార్త సంస్థల హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని గుర్తు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.

" దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరింపజేసేందుకు ఆ సమయంలో లక్షల మంది దేశ భక్తులు పోరాడారు. ఆ సైనికులందరికీ సెల్యూట్​"-- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

ఐదేళ్లుగా తీవ్ర అత్యవసర పరిస్థితి

ఎమర్జెన్సీపై మమతా బెనర్జీ కూడా ట్వీట్​ చేశారు. ఐదేళ్లుగా భాజపా పాలనలో దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్​

" ఐదేళ్లుగా దేశంలో సూపర్​ ఎమర్జెన్సీ నడుస్తోంది. చరిత్ర నుంచి మనం కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడుకునేందుకు పోరాడాలి" -- మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

కేజ్రీవాల్ పొరపాటు

దిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్​

34ఏళ్ల కిందట ఎమర్జెన్సీ వల్ల దేశంలోని ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడి జరిగిందని దిల్లీ సీఎం కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు. రాజ్యంగం కల్పించిన మహోన్నత ప్రజాస్వామ్యానికి మరోసారి అలాంటి పరిస్థితులు రాకూడదని ఆకాంక్షించారు. అయితే, నేటికి ఎమర్జెన్సీ విధించి 44 ఏళ్లు కాగా, కేజ్రీవాల్​ 34ఏళ్లు అంటూ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి : ఇక బాదుడే: గీత దాటితే లక్ష వరకు జరిమానా!

ABOUT THE AUTHOR

...view details