తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిర్మలపై వేటు కోసం మోదీ బడ్జెట్​ కుట్ర!' - pm modi latest news

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​పై విమర్శలు కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. నిరుపయోగమైన బడ్జెట్ కారణంగా తనపై నిందలు రాకుండా ఉండేందుకు ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్​ను తొలగించాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు.

rahul gandhi latest news
'నిర్మలపై వేటు కోసం మోదీ బడ్జెట్​ కుట్ర!'

By

Published : Feb 5, 2020, 6:58 PM IST

Updated : Feb 29, 2020, 7:26 AM IST

'నిర్మలపై వేటు కోసం మోదీ బడ్జెట్​ కుట్ర!'

ప్రధాని నరేంద్రమోదీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారని అన్నారు.

సార్వత్రిక బడ్జెట్​ను ప్రస్తావిస్తూ ట్విట్టర్​లో ఈమేరకు విమర్శలు గుప్పించారు రాహుల్.

"ప్రియమైన ప్రధాని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ నిందను తొలగించుకునేందుకు ఏం చేయాలా అని మీరు మెదడుకు పదునుపెట్టారు. 'దిక్కుతోచని' నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన 'పనికిరాని' బడ్జెట్​ను ఉపయోగించుకోండి. ఆమెను పదవి నుంచి తొలగించి నిందను ఆమెపైనే మోపండి. సమస్య తీరిపోతుంది. "
-రాహుల్ గాంధీ ట్వీట్​.

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలతో మోదీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఇప్పటికే అనేకసార్లు విమర్శించారు రాహుల్.

ఇదీ చూడండి: రామమందిర నిర్మాణానికి స్వతంత్ర ట్రస్ట్: మోదీ

Last Updated : Feb 29, 2020, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details