ఫొని తుపానుపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తుపాను పయనించే మార్గం, చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, సైనిక దళాలను సహాయక చర్యల కోసం వినియోగించాలని నిర్ణయించారు.
తాగునీరు, విద్యుత్, టెలికాం సేవలను పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మోదీ సూచించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు మోదీ నిర్దేశించారు.