నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ముగిసిన సందర్భంగా పాలన సమీక్ష నిర్వహించారు ప్రధాని. గత ఆరునెలల పాలనలో వివిధ శాఖల పనితీరుపై ఆయా శాఖల మంత్రులు, ప్రతినిధులతో చర్చించారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో అమాత్యుల పనితీరును మోదీ సమీక్షించారు.
కేంద్రమంత్రుల ప్రెజెంటేషన్
ఈ సందర్భంగా తమశాఖల పనితీరును, ప్రగతిని, తీసుకున్న నిర్ణయాలను తెలియజేసేలా కేంద్రమంత్రులు ప్రధానికి ప్రజెంటేషన్ రూపంలో వివరించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ.. కేంద్ర మంత్రిమండలి భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చూడండి : ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిపులి!