అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నెల 16,17 వ తేదీల్లో ప్రధాని ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రులను రెండు గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపుతో ఒక్కో రోజు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
త్వరలో సీఎంలతో మరో దఫా మోదీ వీడియో కాన్ఫరెన్స్ - సీఎంలతో మరో దఫా మోదీ వీడియో కాన్ఫరెన్స్
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి ప్రధాని మోదీ మాట్లాడనున్నారని సమాచారం. ఈ కార్యక్రమం ఈ నెల 16,17 తేదీల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేత, కరోనా నియంత్రణకు అవలంబించాల్సిన విధానాలపై చర్చిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీఎంలతో మరో దఫా మోదీ వీడియో కాన్ఫరెన్స్
లాక్‌డౌన్ ఎత్తివేత సహా కరోనా కట్టడికి అవలంబించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:అన్లాక్ 1.0లో పాటించాల్సిన నియమాలు ఇవే..