తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా యోధులదే అంతిమ విజయం: ప్రధాని - rajiv gandhi health university

ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్​పై అలుపెరుగని పోరాటం చేస్తోన్న యోధులదే అంతిమ విజయమని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రపంచ యుద్ధాల అనంతరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా కరోనాను అభివర్ణించారు. కర్ణాటకలో రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 25 ఏళ్లయిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రత్యేక సందేశం ఇచ్చారు ప్రధాని.

modi
'వైరస్​పై కరోనా యోధులదే విజయం'

By

Published : Jun 1, 2020, 12:51 PM IST

కరోనా వైరస్​ను కనిపించని శత్రువుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. అయితే వైరస్​పై పోరాడుతున్న యోధులే మహమ్మారిపై విజయం సాధిస్తారని ఉద్ఘాటించారు. కర్ణాటకలో రాజీవ్​ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 25 ఏళ్లయిన సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ప్రధాని.

"రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా వైరస్. యుద్ధాల తర్వాత పరిస్థితులు మారినట్లే.. కరోనా అనంతరం కూడా పరిస్థితులు మారతాయి. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వైపే ప్రస్తుతం ప్రపంచం చూస్తోంది. భారత కరోనా యోధులు వైరస్​పై సమర్థంగా పోరాడుతున్నారు. వారు యూనిఫాం లేని సైనికులు."

-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

ఆరోగ్య రంగంలో మేకిన్ ఇండియా ఉత్పత్తులు..

ఆరోగ్య రంగంలో నూతన సాంకేతికతను తీసుకురావాలని, టెలిమెడిసిన్​ పరిధిని విస్తరించాలని పేర్కొన్నారు మోదీ. దేశీయ ఉత్పత్తిదారులు వ్యక్తిగత రక్షణ కిట్ల(పీపీఈ) తయారీని ప్రారంభించారని చెప్పారు.

'ఆయుష్మాన్.. భేష్'

ఆయుష్మాన్ భారత్​ ద్వారా కోటిమంది ప్రజలకు ప్రయోజనం కలిగిందన్నారు మోదీ. ఇందులో గ్రామీణులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 22 నూతన ఎయిమ్స్​ ఆసుపత్రుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని చెప్పారు.

రాజీవ్ వర్సిటీపై ప్రశంసలు..

25 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకొంటున్న రాజీవ్​గాంధీ ఆరోగ్య వర్సిటీపై ప్రశంసలు కురిపించారు మోదీ. దేశానికి అద్భుతమైన సేవలు అందించిందని. ప్రస్తుతం మరిన్ని లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చూడండి:ఇక అందరికీ పరీక్షే.. ఆసియాలోనే అగ్రస్థానానికి భారత్​

ABOUT THE AUTHOR

...view details