తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నవభారత నిర్మాణంలో బాపూ ఎప్పటికీ ఆదర్శమే' - president latest news

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దిల్లీలోని రాజ్​ఘాట్​లో ఆయన సమాధికి నివాళులు అర్పించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు. బలమైన, సమర్థమైన దేశాన్ని నిర్మించేందుకు బాపూ ఎప్పటికీ ఆదర్శనీయంగానే ఉంటారని ట్వీట్ చేశారు మోదీ.

PM pays tributes to Mahatma Gandhi
'నవభారత నిర్మాణంలో బాపూ ఎప్పటికీ ఆదర్శమే'

By

Published : Jan 30, 2020, 11:29 AM IST

Updated : Feb 28, 2020, 12:22 PM IST

దిల్లీలోని రాజ్​ఘాట్​లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధికి శ్రద్ధాంజలి ఘటించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నేడు బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. బలమైన, సమర్థమైన, సౌభాగ్యవంతమైన దేశాన్ని నిర్మించేందుకు మహాత్ముడు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారని ట్వీట్ చేశారు మోదీ.

మోదీ ట్వీట్​

"జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు. శక్తిమంతమైన, సుసంపన్నమైన నవభారత దేశాన్ని నిర్మించేందుకు మహాత్ముని ఆలోచనలు ఎప్పటికీ ఆదర్శంగానే ఉంటాయి."
-మోదీ ట్వీట్​.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, సీడీఎస్​ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు, భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్​ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు.

మహాత్మునికి నేతల నివాళి

1948లో ఇదే రోజున మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు.

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: 'ఆమ్ ​ఆద్మీ'కి బంగాల్​ దీదీ మద్దతు

Last Updated : Feb 28, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details