మరాఠా సామ్రాజ్య యోధుడు ఛత్రపతి శివాజీ 390వ జయంతి సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. శివాజీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి - ప్రధాని మోదీ
నేడు ఛత్రపతి శివాజీ 390వ జయంతి. ఈ సందర్భంగా మారాఠా యోధుడికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. శివాజీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ధైర్యానికి, దయ, సుపరిపాలనకు శివాజీ ప్రతీక అని పేర్కొన్నారు మోదీ. శివాజీ ప్రతిమకు నమస్కరిస్తున్న ఫోటోను ట్వీట్‌కు జత చేస్తూ.. శివాజీ జయంతి సందర్భంగా ఆయనను ఆరాధించాలని పిలుపునిచ్చారు. శివాజీ పరాక్రమవంతమైన సైనికుడే కాకుండా ప్రజారంజక పాలకుడని ప్రధాని తెలిపారు. బలమైన నౌకాదళాన్ని సమకూర్చుకోవడం నుంచి ప్రజా అనుకూల విధానాలు రూపొందించడం వరకు.. శివాజీ అన్ని రంగాల్లో అత్యుత్తమమని వెల్లడించారు. బెదిరింపులకు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-పక్షులకు పొంచి ఉన్న ముప్పు... నెమళ్లు సేఫ్