తెలంగాణ

telangana

'గడ్చిరోలి దాడి కారకుల్ని వదిలేది లేదు'

By

Published : May 1, 2019, 3:35 PM IST

Updated : May 1, 2019, 4:42 PM IST

మహారాష్ట్ర గడ్చిరోలి మావోయిస్టుల దాడిలో అమరులైన పోలీసులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. దాడికి కారణమైన వారిని వదలబోమని స్పష్టం చేశారు.

'గడ్చిరోలి దాడి కారకుల్ని వదలబోం'

మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసుల మృతికి కారణమైన వారిని వదలబోమని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మావోయిస్టుల దాడిలో మృతి చెందిన 15మంది పోలీసులు, డ్రైవర్​ ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలు వృథా కావని ట్వీట్​ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

హోంమంత్రి సమీక్ష

గడ్చిరోలి దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​తో మాట్లాడినట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు రాజ్​నాథ్​. రాష్ట్రప్రభుత్వంతో హోంశాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన సహాయం అందిస్తుందని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో నక్సల్స్​ దుశ్చర్య- 16 మంది బలి

Last Updated : May 1, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details