తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ మీదగా ప్రధాని వెళ్లరు: విదేశాంగ శాఖ

కిర్గిజిస్థాన్​ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్​ గగనతలం నుంచి వెళ్లటం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బిష్కెక్​లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఒమన్​, మధ్య ఆసియా దేశాల మీదుగా మోదీ ప్రయాణిస్తారని తెలిపింది.

By

Published : Jun 12, 2019, 5:21 PM IST

మోదీ

కిర్గిజిస్థాన్​కు వెళ్లేందుకు పాకిస్థాన్​ గగనతలాన్ని ప్రధాని నరేంద్రమోదీ వినియోగించటం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కిర్గిజ్​ రాజధాని బిష్కెక్​​లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోదీ రేపు బయల్దేరనున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్​ ఈ ప్రకటన చేశారు.

"బిష్కెక్​ వెళ్లేందుకు వీవీఐపీ విమానాల కోసం భారత ప్రభుత్వం రెండు మార్గాలను సూచించింది. ఒమన్, ఇరాన్​, మధ్య ఆసియా దేశాల మీదుగా బిష్కెక్​ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం."

-రవీశ్ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

బిష్కెక్​లో రెండు రోజుల పాటు ప్రధాని పర్యటించనున్నారు. ఇప్పటికే ఈ ప్రయాణం కోసం పాకిస్థాన్​ ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుంది భారత్​. పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ కూడా బిష్కెక్​ సదస్సుకు హాజరవుతున్నారు.

ఇదీ చూడండి: మోదీ విమానానికి పాకిస్థాన్​ పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details