కరోనా భయంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు దిశానిర్దేశం చేసేందుకు నేడు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ ప్రసంగంలో వైరస్ ప్రమాదానికి సంబంధించిన కీలక అంశాలపై మాట్లాడనున్నట్లు వెల్లడించారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్చి 19న జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని.
కరోనాపై జాతినుద్దేశించి నేడు మోదీ ప్రసంగం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాతినుద్దేశించి ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి మోదీ ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ ప్రసంగంలో వైరస్ నియంత్రణ సహా పలు అంశాలపై మాట్లాడనున్నారు.
కరోనాపై జాతినుద్దేశించి నేడు 'మోదీ' ప్రసంగం
భారత్‌లో కేసులు దాదాపు 500కు చేరువ కావడం వల్ల ప్రధాని మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 492 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వైరస్ కేసులు పెరగడం వల్ల అధికారులు దాదాపు మొత్తం దేశాన్ని లాక్డౌన్లో ఉంచారు. మార్చి 31 వరకు రహదారి, రైలు, వాయు రవాణాను నిలిపివేశారు.