పది రాష్ట్రాల్లో కరోనాను నియంత్రించగలిగితే మహమ్మారిపై విజయం సాధించగలమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఈ పది రాష్ట్రాల్లోనే 80 శాతం క్రియాశీల కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
కరోనా కట్టడిపై 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమంలో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, బిహార్, పంజాబ్, బంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
"దేశంలో రికవరీ రేటు పెరుగుదల ప్రభుత్వ కృషి ఫలిస్తుందని తెలియజేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జట్టుగా పనిచేయాలి. ఈ మహమ్మారిపై పోరులో కంటైన్మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్, నిఘాపై మనకు ఉన్న అనుభవం ప్రభావవంతమైన ఆయుధాలు.
అంతేకాకుండా మరణాల రేటు తగ్గుముఖం పట్టడం సానుకూలాంశం. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో మరణాల రేటు చాలా తక్కువ."
- ప్రధాని నరేంద్రమోదీ
3 రోజుల్లో పరీక్షించాలి..