అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంభాషించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి సహా ఇతర అంశాలపై చర్చించినట్టు ట్వీట్ చేశారు.
"నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫలవంతమైన సంభాషణ జరిగింది. జీ-7లో అమెరికా అధ్యక్షతపై ట్రంప్‌కున్న ప్రణాళికలు, కరోనా వైరస్‌తో పాటు ఇతర సమస్యలను చర్చించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
సరిహద్దు వివాదంపైనా...
ఇరు దేశాధినేతలు భారత్-చైనా సరిహద్దు వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై అగ్రనేతలు సమాలోచనలు చేసినట్లు చెప్పింది.
అమెరికాలో నల్లజాతీయుడు ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రావాలని ట్రంప్‌తో సంభాషణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికాలో జరగనున్న తదుపరి జీ-7 దేశాల సదస్సుకు మోదీని ఆహ్వానించారు ట్రంప్.