తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ

బిహార్​లో నిర్మించిన రూ.900 కోట్ల విలువైన పెట్రోలియం ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వీటిని ప్రారంభించారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక ప్రాజెక్టులను ప్రారంభించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

pm-narendra-modi-dedicates-to-nation-three-petroleum-sector-projects
పెట్రోలియం ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చిన మోదీ

By

Published : Sep 13, 2020, 2:07 PM IST

బిహార్​లోని మూడు పెట్రోలియం సెక్టార్​ ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రూ.900 కోట్లకుపైనే విలువైన ఈ ప్రాజెక్టులను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ ప్రాజెక్టులను ప్రారంభించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కార్యక్రమంలో పాల్గొన్న పెట్రోలియం శాఖ మంత్రి, తదితరులు

ఈ సందర్భంగా మాట్లాడుతూ బిహార్​ అభివృద్ధికి నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మోదీ.

బిహార్​ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. బిహార్​లో సుపరిపాలనను అందిస్తామని హామీ ఇస్తున్నాం. గత 15 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషి ఇలాగే కొనసాగుతుంది. నితీశ్​ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే ఉన్నత విద్యాలయాలు రాష్ట్రానికి వచ్చాయి. కరోనా లాక్​డౌన్​ సమయంలో వలస కార్మికులు తిరిగి రావటం వల్ల పలు సవాళ్ల ఎదురైనా.. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలిగాం.

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

బిహార్​ అభివృద్ధి కోసం రూ.21 వేల కోట్ల విలువైన 10 అతిపెద్ద పెట్రోలియం, గ్యాస్​ ప్రాజెక్టులు మంజూరు చేసింది కేంద్రం. ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టుల్లో పరదిప్​-హల్దియా-దుర్గాపుర్​ నుంచి బంకా వరకు పైప్​లైన్​, బంకాలో ఎల్​పీజీ ప్లాంటు, చంపారన్​లో ఎల్​పీజీ ప్లాంటు ఉన్నాయి.

పెట్రోలియం ప్రాజెక్టు

ఇదీ చూడండి: భార్యను కాల్చి చంపి సీఆర్​పీఎఫ్​​ జవాన్​ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details