తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరీక్షలు, చికిత్సల సామర్థ్యాన్ని పెంచాలి: మోదీ - ప్రధాని మోదీ

PM Narendra Modi c
ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం

By

Published : Sep 23, 2020, 7:10 PM IST

Updated : Sep 23, 2020, 8:40 PM IST

20:10 September 23

పరీక్షలు, చికిత్సల సామర్థ్యాన్ని పెంచాలి: మోదీ

కరోనా మహమ్మారి ఉద్ధృతి ఏడు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా, బ్లాక్​ స్థాయుల్లో వీడియో కాన్ఫరెన్స్​లు నిర్వహించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. పరీక్షలు, చికిత్సల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.  

" దేశంలో 700లకు పైగా జిల్లాలు ఉన్నాయి. కానీ, ఏడు రాష్ట్రాల్లోని 60జిల్లాల్లోనే వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడు రోజుల పాటు జిల్లా, బ్లాక్​ స్థాయుల్లో ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్​లు నిర్వహించాలని ముఖ్యమంత్రులకు సూచిస్తున్నా. సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్షలు, కేసులను గుర్తించటం, చికిత్స, నిఘా, ప్రజలు అవగాహన కల్పించటం వంటివాటిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది." 

 - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.   

ఎలాంటి లక్షణాలు లేకుండానే చాలా వరకు వైరస్​ వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. ప్రజల్లో అవగాహన కల్పించటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు మోదీ. అలాంటి సందర్భంలో పుకార్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, టెస్టింగ్​పై ప్రజల్లో సందేహాలు నెలకొంటాయన్నారు. వైరస్​ వ్యాప్తిని కొందరు తక్కువ అంచనా వేస్తూ తప్పు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమయంలో మాస్కులు ధరించడం చాలా ఇబ్బందిగా భావిస్తున్నా.. మన జీవితంలో మాస్క్​ను ఒక భాగంగా చేసుకోకుంటే సరైన ఫలితాలు సాధించలేమన్నారు మోదీ.

18:54 September 23

ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం

కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో దృశ్యమాద్యమం ద్వారా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ రాష్ట్రాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్తరిస్తున్న తీరు, మహమ్మారిని అరికట్టడానికి చేపడుతున్న చర్యలు.. తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు.  

ఈ ఏడు రాష్ట్రాల్లోనే 65.5 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్, తమిళనాడు, దిల్లీ, పంజాబ్​ ఉన్నాయి. క్రియాశీల కేసుల్లో 63శాతం, మరణాల సంఖ్యలో 77 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

Last Updated : Sep 23, 2020, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details