దేశాన్ని చెత్తనుంచి విముక్తి చేసేందుకు.. వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా ఈ ప్రచార పర్వానికి దిల్లీలోని రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంలో మోదీ శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. వారికి కరోనా జాగ్రత్తలను చెప్పారు. భౌతిక దూరం ఆవశ్యకతను వివరించారు. కరోనాపై పోరాటంలో స్వచ్ఛ భారత్ అభియాన్ సహాయకారిగా నిలుస్తుందని మోదీ ఆకాంక్షించారు.