వారణాసిలోని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టారు నలుగురు మోసగాళ్లు. ప్రముఖ ఆన్లైన్ సంస్థ 'ఓఎల్ఎక్స్'లో అందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
"నిందితులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయాన్ని 'ఓఎల్ఎక్స్'లో అమ్మేందుకు ప్రయత్నించారు. కార్యాలయానికి సంబంధించిన చిత్రంతో పాటు ప్రకటనను అందులో ఉంచారు. దీనిని గుర్తించాం. నిందితులను అదుపులోకి తీసుకున్నాం. దర్యాప్తు చేస్తున్నాం."