తన రక్ష కోరుతూ.. రాఖీ పంపిన ఓ సోదరికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఉత్తరాఖండ్, రుద్రపుర్ కు చెందిన దీప మటేలా.. జులై 28న స్పీడ్ పోస్టు ద్వారా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి సింగ్ రావత్ లకు ప్రత్యేక ఆయిపన్ డిజైన్ రాఖీలు పంపారు. ఆ రాఖీ అందిన వెంటనే.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోదర భావంతో ప్రేమను పంచుకున్న దీపకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.
ప్రధాని కార్యాలయం నుంచి లేఖ అందుకున్న దీప సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఉత్తరాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.