తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ఆస్తుల విలువ ఎంత పెరిగిందో తెలుసా?

సగటు మధ్యతరగతి వ్యక్తుల్లాగే ఆయన కూడా తన జీతంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకే కేటాయిస్తున్నారు. పొదుపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీనే. తాజాగా ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలను బహిర్గతం చేశారు.

By

Published : Oct 15, 2020, 1:55 PM IST

Pm modis latest declaration of assets and liabilities
మోదీ చరాస్తుల విలువ ఎంత పెరిగిందో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన చరాస్తులు ప్రకటించారు. గత 15 నెలల కాలంలో వాటి విలువ రూ.36.53 లక్షలు పెరిగింది. మొత్తం చరాస్తుల విలువ రూ.1కోటి 39లక్షల 10వేల 260 నుంచి రూ.1కోటి 75లక్షల 63వేల 618కి చేరింది. ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల జీతమే ఆయనకు ముఖ్య ఆదాయ వనరు. దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది. తాజాగా మోదీ తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ఎప్పటిలాగే మోదీ స్థిరాస్తుల్లో ఎలాంటి మార్పులేదు.

  • మోదీకి తన స్వరాష్ట్రం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఒక ఇల్లు, స్థలం ఉంది. వాటి విలువ రూ.1.1 కోట్లు.
  • ప్రధాని ఎక్కువగా పన్ను మినహాయింపు మార్గాలను ఎంచుకుంటున్నారు. అందుకు ఆయన జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సీస్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లలలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది ఈక్విటీ మార్కెట్‌పై ఆయనకున్న స్పష్టతను తెలియజేస్తోంది.
  • ఇటీవలి కాలంలో ఎన్‌ఎస్‌సీస్‌లో ఆయన పెట్టుబడి పరిమాణం పెరగ్గా, బీమా ప్రీమియంలో తగ్గుదల కనిపిస్తోంది.
  • జూన్‌ 30 నాటికి ప్రధాని పొదుపు ఖాతాలో మోత్తం రూ.3.38లక్షలు ఉండగా, ఆయన వద్ద నగదు రూపంలో రూ. 31,450 మాత్రమే ఉన్నాయి.
  • ఎస్‌బీఐ గాంధీ నగర్‌ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రూ.1కోటి 27లక్షల 81వేల 575 నుంచి రూ.1కోటి 60లక్షల 28వేల39కి పెరిగింది. గత సంవత్సరం ఎన్నికలు సమయంలో వెల్లడించిన వివరాలతో ఇవి సరిపోలుతున్నాయి.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర కెేబినెట్ మంత్రులు, పార్లమెంట్ సహచరులతో పాటు.. తన జీతభత్యాల్లో కోత విధించుకొనేందుకు మోదీ ముందుకు వచ్చారు.

అప్పటి నుంచి..

ప్రజాజీవితంలో పారదర్శకత కోసం ఆస్తుల వెల్లడి ప్రక్రియను.. 2004లో అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లోని రాజకీయ నేతలు వారి ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సమయంలో కూడా అఫిడవిట్‌లో ఈ వివరాలను పొందుపర్చుతారు. ఇక లోక్‌పాల్, లోకాయుక్త చట్టం(2013) ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వారి వార్షిక ఆదాయాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:కలాం.. మీ కృషి దేశం ఎన్నటికీ మరువదు: మోదీ

ABOUT THE AUTHOR

...view details