గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. దేశంలోనే తొలి సీ-ప్లేన్ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆ ప్లేన్‌లోనే కేవడియా నుంచి సబర్మతికి ప్రయాణం చేశారు.
దేశంలో తొలి 'సీ- ప్లేన్' సేవలను ప్రారంభించిన మోదీ
13:04 October 31
10:13 October 31
'అప్పుడు కూడా రాజకీయమేనా?'
ఐక్యతా విగ్రహం వద్ద ప్రసంగించిన ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు.
"(పుల్వామా దాడి) జవాన్ల మరణ వార్త విన్న సమయంలో దేశ ప్రజలంతా తీవ్ర దుఖంలో మునిగిపోయారు. కానీ కొందరు ప్రజల దుఖంలో పాలుపంచుకోలేదు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ వీరు రాజకీయాలు చేశారు, స్వార్థాన్ని వెతుకున్నారు. ఎలాంటి మాటలన్నారో దేశ ప్రజలు మర్చిపోరు. ఎలా భయపెట్టారు మర్చిపోరు. దేశం విలవిలాలడుతున్న సమయంలో స్వార్థపూరిత రాజకీయాలు చేసిన వారిని దేశం మర్చిపోదు. అప్పుడు... అమర వీరులను చూస్తూ నేను వివాదాలకు దూరంగా నిలబడ్డాను. ఎన్ని ఆరోపణలు చేసినా పడ్డాను. తప్పుడు మాటలు మాట్లాడినా సహించాను. జవాన్ల మరణతో నా మనస్సు దుఖించింది. కానీ.. పొరుగు దేశం(పాకిస్థాన్) నుంచి ఇటీవలే ఓ వార్త వచ్చింది. ఆ దేశ పార్లమెంట్‌లోనే నిజాన్ని బయటపెట్టారు. దీంతో వీరి నిజస్వరూపం బయటపడినట్టు అయ్యింది. స్వార్థపూరిత రాజకీయాల కోసం వీరు ఎక్కడి వరకు వెళతారనేది పుల్వామా ఉదంతంతో ప్రజలకు తెలిసొచ్చింది. వీరందరినీ నేను ప్రార్థిస్తున్నా. దేశ హితం కోసం దయచేసిన ఇలాంటి రాజకీయాలు చేయకండి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
09:44 October 31
'పుల్వమాపై విపక్షాలు రాజకీయం'
పుల్వామా ఉగ్రదాడి సమయంలో విపక్షాలు రాజకీయాలు చేశాయని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలాంటి సందర్భలోనూ స్వార్థపూరిత రాజకీయాలు చేయడం తగదన్నారు.
09:35 October 31
'సైన్యం ఉంది..'
భారత సైన్య శక్తిసామర్థ్యాలు పెరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత భూభాగంపై కన్నేసిన వాళ్లకి సైన్యం బుద్ధి చెబుతుందన్నారు.
09:17 October 31
మోదీ ప్రసంగం
పోలీసులు, కరోనా యోధుల తరఫున భారత్ మాతాకీ జై: ప్రధాని
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా స్మరించుకుందాం: ప్రధాని
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ జరుపుకొంటున్నాం: ప్రధాని
పర్యాటక రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి: ప్రధాని మోదీ
దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా పర్యాటకానికి కొత్త రూపు తీసుకొస్తాం: ప్రధాని
08:24 October 31
రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరేడ్
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా విగ్రహం వద్ద రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరేడ్‌ను ఏర్పాటు చేశారు. పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ ఈ పరేడ్‌ను వీక్షించారు.
08:12 October 31
పటేల్‌కు మోదీ నివాళి
గుజరాత్ కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ పటేల్‌కు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
06:55 October 31
సర్దార్కు నివాళి అర్పించనున్న మోదీ
రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా శనివారం.. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐక్యతావిగ్రహం వద్ద నివాళులు అర్పించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్ - కేవడియా మధ్య చక్కర్లు కొడుతూ.. పర్యటకులకు సరికొత్త అనుభూతిని అందించే సీ ప్లేన్ సర్వీసులను మోదీ ప్రారంభించనున్నారు.
శుక్రవారం గుజరాత్ వెళ్లిన ప్రధాని మోదీ నాలుగు కీలక పర్యటక ఆకర్షణ కేంద్రాలు సహా.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.