తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నారీశక్తులు.. మీరు ఎందరికో స్ఫూర్తి: మోదీ

నారీశక్తి పురస్కార గ్రహీతలతో మాటామంతి నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలోని ఎందరికో వారు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భారత్​లోని పిల్లల్లో పోషకాహార లోపం, నీటి సంరక్షణపై మహిళలు, మహిళా సంఘాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

Nari Shakti Puraskar
నారీశక్తులు.. మీరు ఎందరికో స్ఫూర్తి: మోదీ

By

Published : Mar 8, 2020, 6:07 PM IST

Updated : Mar 8, 2020, 11:48 PM IST

నారీశక్తులు.. మీరు ఎందరికో స్ఫూర్తి: మోదీ

దేశంలోని ఎందరికో ప్రేరణగా నిలిచారని నారీశక్తి పురస్కార గ్రహీతలను ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించి నారీశక్తి పురస్కారాలు అందుకున్న మహిళలతో భేటీ అయ్యారు మోదీ.

'భారత్​లో గొప్ప పనులు చేయాలంటే పెద్ద కుటుంబాలు, పెద్ద నగరాలకు చెందిన వ్యక్తులకు మాత్రమే సాధ్యం' అనే భావన నేడు పోయిందన్నారు మోదీ. సాధారణ వ్యక్తులు కూడా అద్భుతాలు చేయగలరని మహిళలు చాటి చేప్పారని కొనియాడారు.

"మీ అందరికి అభినందనలు. పురస్కారాల కోసం మీరు పని చేసుండరు. పని ప్రారంభించినప్పుడు.. గౌరవ సత్కారాలు లభిస్తాయని మీరు కూడా అనుకుని ఉండరు. మీరు చేస్తున్న పనిని ఒక మిషన్​గా భావించి ఉండొచ్చు. లేదా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగి ఉండొచ్చు. లేదా సహజంగానే చేసి ఉండొచ్చు. దాని పరిణామం ఇప్పుడు దేశంలోని చాలా మందికి ప్రేరణగా నిలిచింది. మీ జీవిత కథను తెలుసుకోవాలని ప్రజలకు కుతుహలంగా ఉంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

పోషకాహార లోపం, నీటి సంరక్షణపై దృష్టి సారించాలి..

మహిళల సంక్షేమం, వారు సాధించిన ఘనతలపై ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో సహా అంతటా తగిన ప్రాధాన్యం లభిస్తోందన్నారు మోదీ. స్వచ్ఛ భారత్​, మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతం చేయడంలో మహిళల పాత్ర ఎనలేనిదని కీర్తించారు ప్రధాని. అదే తరహాలో భారత్​లోని పిల్లల్లో పోషకాహార లోపం, నీటి సంరక్షణ, నీటిని అందరికి అందుబాటులో ఉంచడంపై మహిళలు, మహిళా సంఘాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అవార్డు అందుకున్న భారత యుద్ధమివానాల తొలి మహిళా ఫైలట్లు మోహన జితర్వాల్​, అవనీ చతుర్వేది, భావనాకాంత్​, క్రీడారంగంలో విశేష సేవలు అందించిన 103 ఏళ్ల క్రీడాకారిణి మన్​కౌర్​, బీనాదేవి సహా 14 మంది తాము జీవితంగా ఎదుర్కొన్న ఒడుదొడుకులను వివరించారు. అనంతరం 103 ఏళ్ల మన్​కౌర్​ ఆశిస్సులు తీసుకున్నారు ప్రధాని మోదీ.

సామాజిక ఖాతాలు వారికే..

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ బాధ్యతను నారీశక్తి గ్రహీతలకు అప్పగించారు. #SheInspiresUs హ్యాష్​ట్యాగ్​తో ఈ కార్యక్రమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రధాని.

ఇదీ చూడండి: కరోనాను నిర్ధరించే 2 ల్యాబ్​లు పనిచేస్తున్నాయిలా...

Last Updated : Mar 8, 2020, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details