తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రమాదకర అడవిలో మోదీ ఏం చేశారంటే...! - మ్యాన్​ వర్సెస్​ వైల్డ్

ప్రముఖ సాహస వీరుడు బేర్​ గ్రిల్స్​తో కలిసి మోదీ చేసిన సాహసాలు ఏమిటో తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 12న ఈ షో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో మోదీతో ప్రయాణంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు గ్రిల్స్​.

ప్రమాదకర అడవిలో మోదీ ఏం చేశారంటే...!

By

Published : Aug 10, 2019, 1:34 PM IST


ప్రపంచప్రఖ్యాత 'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​ కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ కనిపించనున్నారు. ప్రముఖ సాహస వీరుడు బేర్​ గ్రిల్స్​తో కలిసి మోదీ చేసిన సాహసాలు డిస్కవరీ ఛానల్​లో ఆగస్టు 12న ప్రసారం కానున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సాహసయాత్రపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు గ్రిల్స్.
విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఎంతో ప్రశాంతంగా ఉన్నారని కొనియాడారు గ్రిల్స్​. ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్నవారు ఇలాంటి యాత్ర చేపట్టడం ఎన్నడూ చూసి ఉండరని తెలిపారు.

బేర్​ గ్రిల్స్

"రాజకీయ నాయకులు పోడియం వద్ద మంచి వస్త్రధారణలో ఉండటం మీరు చూస్తూ ఉంటారు. కానీ అటవీ ప్రాంతం అందరినీ సమానంగా చూస్తుంది. మీరు ఎవరైనా సరే పట్టించుకోదు. మీ నిబద్ధత, ధైర్యానికి ప్రశంసలు ఇస్తుంది. మేము అడవిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద రాళ్లు, భారీ వర్షాలను ఎదుర్కొన్నాం. మాతో వచ్చిన బృందం భయపడింది. కానీ ప్రధానమంత్రి మోదీ చాలా ప్రశాంతంగా ఉన్నారు. మా యాత్ర మొత్తం అలాగే ఉండటం నేను గమనించాను. మేము ఏది చేసినా.. ఆయన ప్రశాంతంగానే ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో అలా ఉన్న వారిని మీరు చూసి ఉండరు. ప్రపంచ స్థాయి నాయకుడిని అలా చూడటం ఎంతో సంతోషంగా ఉంది."

- బేర్​ గ్రిల్స్, ప్రముఖ సాహస వీరుడు

ఉన్నవాటితోనే...

ప్రధాని మోదీ ఎంతో గొప్ప వ్యక్తి అని కొనియాడారు గ్రిల్స్​. యాత్రలో భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఆయన రక్షణ సిబ్బంది గొడుగులు ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వాటిని తిరస్కరించేవారని చెప్పారు​. తమ వద్ద ఉన్న టార్పాలీన్​ కవర్లు, వెదురు వస్తువులతోనే సర్దుకునేవారని తెలిపారు. వాటితోనే నదిని దాటినట్లు చెప్పారు. వర్షంలో పూర్తిగా తడిసిపోయినప్పటికీ మోదీ చిరునవ్వుతోనే ఉన్నారని గుర్తుచేసుకున్నారు గ్రిల్స్.

విపత్కర వాతావరణంలో ఉప్పొంగుతున్న నదులు దాటే సమయంలో తనపై పూర్తి నమ్మకంతో మోదీ యాత్ర కొనసాగించారని పేర్కొన్నారు గ్రిల్స్​.

"వన్యప్రాణులు, విపత్కర వాతావరణం, పెద్ద నదుల నుంచి మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అని యాత్ర ప్రారంభంలోనే ఆయనకు చెప్పాను. ఆయన ప్రశాంతంగా ఉండిపోయారు. నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచి నాతో ప్రయాణం చేశారు. కానీ ఆయన భద్రతా సిబ్బందికి ఆయుధాలు, ఇతర సామగ్రిని మోసుకు రావడం చాలా ఇబ్బందిగా మారింది. యాత్ర మధ్యలో ప్రధాని ప్రశాంతంగా ఉండటమే కాదు ఎంతో ఉల్లాసంగా ఉన్నారు."
- బేర్​ గ్రిల్స్, ప్రముఖ సాహస వీరుడు

గత నెలలో సుమారు 4 నిమిషాల ప్రోమోను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు గ్రిల్స్​. అది అంతర్జాలంలో సంచలనంగా మారింది. ఈ షో కోసం ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఊరూరా పంద్రాగస్టు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details