తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేవ్​ దీపావళి మహోత్సవంలో ప్రధాని మోదీ

PM MODI VISITS VARANASI- LIVE UPDATES
వారణాసిలో మోదీ- ఎన్​హెచ్​ 19 ప్రారంభం

By

Published : Nov 30, 2020, 3:25 PM IST

Updated : Nov 30, 2020, 6:54 PM IST

18:51 November 30

'కాశీ మారదు..'

కరోనాతో ఎన్ని మారినా.. భక్తి, శక్తి, కాశీని ఎవరూ మార్చలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేవ్​ దీపావళి మహోత్సవంలో పాల్గొన్న ఆయన తొలి దీపాన్ని వెలిగించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. 

18:28 November 30

  • వారణాసిలో దేవ్‌ దీపావళి మహోత్సవం
  • దేవ్‌ దీపావళి మహోత్సవంలో పాల్గొన్న ప్రధాని, యోగి ఆదిత్యనాథ్‌
  • దీపం వెలిగించి దేవ్‌ దీపావళి మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని

17:50 November 30

దీపాల వెలుగులు..

కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ.. రాజ్​ఘాట్​కు చేరుకున్నారు. అక్కడ జరగనున్న దేవ్​ దీపావళి మహోత్సవంలో పాల్గొననున్నారు.

17:02 November 30

కాశీనాథుడి సన్నిధిలో...

వారణాసి పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మరికొద్ది సేపట్లో కాశీ ఆలయ కారిడర్​ను ప్రారంభించనున్నారు మోదీ.

16:56 November 30

Varanasi: Prime Minister Narendra Modi and CM Yogi Adityanath arrive at Lalita Ghat, to visit Kashi Vishwanath Temple

బోటులో ప్రయాణించిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​లు లలిత ఘాట్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లనున్నారు.

16:39 November 30

పడవ ప్రయాణం...

వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​తో కలిసి పడవపై దోమరి ఘాట్​ నుంచి లలిత ఘాట్​కు ప్రయాణించారు. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ్​ ఆలయ కారిడర్​ ప్రాజెక్టును సమీక్షించనున్నారు.

16:07 November 30

'సాగు చట్టలతో మేలే'

వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణలు.. రైతులకు కొత్త అవకాశాలు అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన చట్టాలతో అన్నదాతలకు న్యాయపరమైన రక్షణ కూడా లభించిందన్నారు. ఈ సంస్కరణ ఫలాలు రానున్న రోజుల్లో తెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆరు వరుసల జాతీయ రహదారి-19ని జాతికి అంకితమిచ్చారు. అనంతరం బహిరంగ సభలో నూతన సాగు చట్టాల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో రుణ మాఫీని ప్రభుత్వాలు ప్రకటించేవని.. కానీ అవి రైతుల వరకు చేరేవి కాదని ఆరోపించారు. పెద్దస్థాయి మార్కెట్లలో అవకాశాలు కల్పించి.. అన్నదాతలను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని వెల్లడించారు. ఇవన్నీ రైతుల సంక్షేమం కోసమే చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మెరుగైన మద్దతు ధర, సౌకర్యాలు కల్పించే వారికి తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు దక్కకూడదా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మోదీ. ఒకప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారని.. కానీ ఇప్పుడు ఊహాగానాలను, అసత్య వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తమ నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. ఊహాగానాలు వ్యాపింపజేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

15:29 November 30

'వారణాసి కనెక్టివిటీ..'

ఇన్నేళ్లుగా వారణాసి పట్టణ సుందరీకరణకు ఎంతో కృషి చేశామని.. ఇప్పుడు కనెక్టివిటీపై దృష్టి సారించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నూతన రహదారులు, హైవేలు, ట్రాఫిక్​ జామ్​ను తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. స్వాతంత్ర్యం నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో వారణాసిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

15:11 November 30

జాతీయ రహదారి-19

వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జాతీయ రహదారి-19లో భాగంగా ప్రయాగ్​రాజ్​-రాజాతలాబ్​ వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్ట్​తో వారణాసితో పాటు ప్రయాగ్​రాజ్​ వాసులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

Last Updated : Nov 30, 2020, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details