దివంగత నేత అరుణ్‌జైట్లీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. ఇవాళ ఉదయం విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన మోదీ నేరుగా దక్షిణ దిల్లీలోని జైట్లీ నివాసానికి వెళ్లారు. జైట్లీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
జైట్లీ నివాసంలోనే 20-25 నిమిషాలు గడిపిన మోదీ... జైట్లీ భార్య, బిడ్డలను ఓదార్చారు. ప్రధాని కంటే ముందు జైట్లీ నివాసానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు.