ప్రధాని నరేంద్రమోదీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. పారిశుద్ధ్యం, ఆరోగ్యం లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి అంతర్జాతీయ గౌరవం దక్కింది. మోదీకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ స్థాపించిన 'బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్' అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.
మోదీకి 'గేట్స్' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్ - swatch bharat
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వినూత్న ఆలోచనకు బిల్ మిలిందా గేట్స్ పురస్కారం వరించింది.
మోదీ
"మరో అవార్డు.. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. మోదీ ఆలోచనలు, వివిధ అంశాల్లో చొరవకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్కు.. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ పురస్కారం వరించింది. ఈ నెలలో అమెరికాలో పర్యటనలో మోదీకి ఈ అవార్డును అందజేస్తారు."
-జితేంద్ర సింగ్, పీఎంఓ సహాయమంత్రి
Last Updated : Sep 29, 2019, 5:41 AM IST