తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోనున్న ప్రధాని మోదీ - PM modi to quit social media

pm-modi-to-quit-social-media
సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోనున్న ప్రధాని మోదీ?

By

Published : Mar 2, 2020, 9:17 PM IST

Updated : Mar 3, 2020, 5:10 AM IST

22:12 March 02

సామాజిక మాధ్యమాలకు దూరంగా మోదీ

సామాజిక మాధ్యమాలకు దూరంగా మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. నిజ జీవితంలోనే కాకుండా... సామాజిక మాధ్యమాల్లోనూ మోదీని అనుసరించే వారి సంఖ్య ఎక్కువే. ఇందుకు మోదీ ట్విట్టర్​, ఫేస్​బుక్​ అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్యే నిదర్శనం. కానీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని. సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. ఈ ఆదివారం తన ట్విట్టర్​, ఫేస్​బుక్​, యూట్యూబ్​ ఖాతాలను తొలగిస్తున్నట్టు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో మోదీ చాలా చురుకుగా ఉంటారు. మోదీ ట్విట్టర్ ఖాతాను 5కోట్ల 33 లక్షల(53.3 మిలియన్​) మంది అనుసరించడానికి ఇది ఓ కారణం. తాను ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా.. ప్రపంచంలో ఏం జరిగినా వెంటనే ట్వీట్​ చేస్తారు. మరి ఇలాంటి నిర్ణయం ప్రధాని ఎందుకు తీసుకున్నారనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

21:29 March 02

బై..బై...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోనున్నట్లు ట్వీట్​ చేశారు. ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ వంటి సామాజిక మాధ్యమాల్లోని తన అకౌంట్ల​ను ఈ ఆదివారం తొలగించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వివరాలు తెలియజేస్తానని తన ట్విట్టర్​ ఖాతాలో రాసుకొచ్చారు ప్రధాని. 

21:13 March 02

సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోనున్న ప్రధాని మోదీ?

ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ వంటి సామాజిక మాధ్యమాల నుంచి తన అకౌంట్​ను ఈ ఆదివారం తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్​ చేశారు. 

Last Updated : Mar 3, 2020, 5:10 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details