రామమందిర భూమిపూజ కోసం చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శంకుస్థాపన మహోత్సవం జరగనుంది ఇలా...
11:30:- ప్రధాని మోదీ అయోధ్య చేరుకుంటారు. ఆ వెంటనే హనుమాన్‌గఢీ ఆలయానికి వెళతారు. 5-7 నిమిషాల పాటు అక్కడే ఉంటారు.
12:00:- రామ జన్మభూమి ప్రాంగణానికి మోదీ చేరుకుంటారు. అప్పటికే పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి.
12:15:- మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో క్రతువు ముగిసేలా ముహూర్తం నిర్ణయించారు. అదే సమయానికి గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.
- ఈ వేడుకలు మధ్యాహ్నం 1:30గంటల వరకు జరగనున్నాయి.
- భూమిపూజ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశముంది.
అయోధ్య రామమందిర శంకుస్థాపన, ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. అయోధ్య వీధుల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో.. నిబంధనలను పాటిస్తూనే వేడుకను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇవీ చూడండి:-