రాజస్థాన్ పాళీ జిల్లాలోని విజయ వల్లభ సాధన కేద్రంలో 'స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
'స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ - statue of peace inauguration news
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో 'స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం జైన్ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ మహారాజ్ 151వ జన్మదినం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
!['స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ pm modi to launch statue of peace tomorrow via video conferencing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9554429-178-9554429-1605467797277.jpg)
'స్టాట్యూ ఆఫ్ పీస్' విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
జైన్ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ మహారాజ్ 151వ జన్మదినం సందర్భంగా 151 అంగుళాల ఎత్తైన విగ్రహాన్ని రూపొందించారు. అష్టధాతు లోహాలతో విగ్రహాన్ని తయారుచేశారు.
శ్రీ విజయ వల్లభ సురేశ్వర్ మహారాజ్ ఒక జైన్ ఆచార్యులు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో పాటలు, శ్లోకాలు రాశారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొన్నారు.