తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులు, చిరు వ్యాపారులకు పింఛను రేపటి నుంచే!

గురువారం ఝార్ఖండ్​లో పర్యటించనున్నారు ప్రధాని. రాంచీలో ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పింఛను పథకాలను ప్రారంభించనున్నారు.

ఝార్ఖండ్​: రేపు పింఛను పథకాలను ప్రారంభించనున్న మోదీ

By

Published : Sep 11, 2019, 3:31 PM IST

Updated : Sep 30, 2019, 5:54 AM IST

ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ పింఛను పథకాలనుప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో గురువారం ప్రారంభించనున్నారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ కొత్త భవనాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. దేశ వ్యాప్తంగా 462 ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌కు ఆన్​లైన్‌ ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు.

ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన.. రైతులకు సామాజిక భద్రతను కల్పించనుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న రైతులు ఈ పథకం కింద రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చాక వారికి నెలకు 3 వేల రూపాయల చొప్పున ఫించను లభిస్తుంది. ఇప్పటికే ఈ పథకం కింద ఝార్ఖండ్‌లో లక్షా 16 వేల 183 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు.

ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్‌ మాన్‌ధన్‌ యోజన, స్వరోజ్‌గార్‌ ఫించను పథకాల లబ్ధిదారులకు కూడా ఇవే నియమాలు వర్తించనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రాంచీ నుంచే ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి:- మోదీ వస్తువులను మీ సొంతం చేసుకోండిలా...

Last Updated : Sep 30, 2019, 5:54 AM IST

ABOUT THE AUTHOR

...view details