తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కార్మికుల కోసం 'ప్రధాని' నూతన పథకం - PM Modi to launch 'Garib Kalyan Rojgar Abhiyaan' to boost livelihood opportunities in rural India

కరోనాతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులే లక్ష్యంగా ఓ నూతన పథకానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకాన్ని జూన్​ 20న 'గరీబ్​ కల్యాణ్​ రోజ్​గార్​ అభియాన్​' పేరిట బిహార్​లో ప్రారంభించనున్నారు.

PM Modi to launch 'Garib Kalyan Rojgar Abhiyaan' to boost livelihood opportunities in rural India
వలస కార్మికుల కోసం ప్రధాని నూతన పథకం

By

Published : Jun 18, 2020, 12:33 PM IST

కరోనా వైరస్ కారణంగా.. పట్టణాల నుంచి స్వస్థలాలకు చేరి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలే లక్ష్యంగా కేంద్రం నూతన పథకాన్ని ప్రారంభించనుంది. గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రూపొందించిన గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కార్యక్రమాన్ని జూన్ 20 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిహార్‌లోని తెలిహార్ నుంచి ప్రధాని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

తొలుత బిహార్, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని.. 116 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ 116 జిల్లాలలో 125 రోజుల పాటు పని కల్పించనున్నారు. సాధారణ సేవల కేంద్రాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా 116 జిల్లాలలోని గ్రామాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.

గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన ద్వారా 50వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించే 25 రకాల పనులను చేపట్టనున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సహా 12 మంత్రిత్వశాఖల సమన్వయంతో గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఇదీ చూడండి:పన్నెండో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

ABOUT THE AUTHOR

...view details