ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్‌నెస్ ఔత్సాహికులు, శిక్షకులతో గురువారం వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో క్రికెటర్ విరాట్ కోహ్లి, రన్నర్ మిలింద్ సొమన్, పౌష్టికాహార నిపుణురాలు రుజుతా దివాకర్ తదితరులు పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
రేపు మోదీతో కోహ్లీ భేటీ.. ఫిట్ ఇండియాపై చర్చ
ఫిట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా క్రికెటర్ విరాట్ కోహ్లి, రన్నర్ మిలింద్ సొమన్తో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పీఎంఓ అధికారులు ఓ ప్రకటన చేశారు.
ఫిట్ఇండియా
దేశ పౌరులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ధ్యేయంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 'ఫిట్ ఇండియా ఉద్యమాన్ని గతేడాది మోదీ ప్రారంభించారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి:ఏడు రాష్ట్రాల సీఎంలతో నేడు ప్రధాని మోదీ భేటీ
Last Updated : Sep 23, 2020, 7:23 AM IST