వ్యాక్సిన్ భద్రతపై ఉన్న భయాలు, అపోహలను తొలగించాలని వైద్య నిపుణులకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది 'క్లీన్ చిట్' ఇస్తే టీకా భద్రతపై ప్రజలకు బలమైన సందేశం అందుతుందని అన్నారు.
తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని వైద్య సేవల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన... వ్యాక్సిన్ స్వీకరించినవారి అనుభవాలను తెలుసుకున్నారు. తమకు ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని టీకా తీసుకున్న సిబ్బంది స్పష్టం చేశారు.