'నమామి గంగా' మిషన్‌లో భాగంగా.. ఉత్తరాఖండ్‌లో గంగా జలాలను శుద్ధి చేసేందుకు నిర్మించిన ఆరు మెగా ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
హరిద్వార్‌లోని జగ్జీత్పుర్లో ఇటీవలే 68 ఎమ్ఎల్డీ ఎస్టీపీ(సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ప్రాజెక్టును నిర్మించారు. అదే ప్రాంతంలోని 27 ఎమ్ఎల్డీ సామర్థ్యం ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఆధునికీకరించారు. ఈ ప్రాజెక్టులతో పాటు మరో నాలుగింటిని ఉదయం 11గంటలకు మోదీ ప్రారంభించనున్నారు.