హిమాచల్ ప్రదేశ్ లాహౌల్ వ్యాలీలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు.
"అటల్ జీ సొరంగ నిర్మాణం వల్ల లాహౌల్-స్పితి, పంగి ప్రాంతాల్లోని రైతులు, పశుకాపరులు, విద్యార్థులు, వ్యాపారులు లాభం పొందుతారు."
- నరేంద్ర మోదీ, ప్రధాని
13:25 October 03
హిమాచల్ ప్రదేశ్ లాహౌల్ వ్యాలీలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు.
"అటల్ జీ సొరంగ నిర్మాణం వల్ల లాహౌల్-స్పితి, పంగి ప్రాంతాల్లోని రైతులు, పశుకాపరులు, విద్యార్థులు, వ్యాపారులు లాభం పొందుతారు."
- నరేంద్ర మోదీ, ప్రధాని
12:27 October 03
అటల్జీ టన్నెల్ ఉత్తర ద్వారం నుంచి దక్షిణ ద్వారానికి వెళ్లే బస్సును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 15 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు.
12:15 October 03
సొరంగ మార్గం ఉత్తర ద్వారం వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అక్కడి అత్యవసర స్పందనా స్థలాన్ని సందర్శించారు.
11:56 October 03
అటల్ సొరంగం దక్షిణ ద్వారం (రోహ్తంగ్) నుంచి ఉత్తర ద్వారం (లాహౌల్)కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్నారు.
11:36 October 03
అటల్ సొరంగమార్గాన్ని ఎంతో వేగంగా నిర్మించాం. 26 ఏళ్లలో జరగాల్సిన పనిని మేం ఆరేళ్లలో పూర్తి చేశాం. లద్దాఖ్‌లోని దౌలత్‌బాగ్ ఓల్డీలో మౌలిక వసతులు కల్పించాం. సరిహద్దుల్లో విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. సరిహద్దుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ టన్నెల్ సహకరిస్తుంది. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గం నిర్మించాం. రహదారుల అనుసంధానంతోనే దేశ ప్రగతి సాధ్యం. సరిహద్దుల్లో రోడ్ల అనుసంధానం అనేది దేశ భద్రతకు ఎంతో అవసరం
- ప్రధాని మోదీ
11:36 October 03
ఇవాళ చారిత్రక రోజు. ఈ సొరంగమార్గం నిర్మాణంతో వాజ్‌పేయీ కల సాకారమైంది. వాజ్‌పేయీ స్వప్నాలను మేం సాకారం చేశాం. అటల్ సొరంగమార్గం వల్ల కోట్లమంది స్థానికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సొరంగమార్గం పూర్తి చేశారు. సొరంగమార్గం పూర్తి చేసిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు. అటల్ టన్నెల్ వల్ల 3 నుంచి 4 గంటల సమయం ఆదా అవుతుంది. దిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గుతుంది. అటల్ టన్నెల్ వల్ల సరిహద్దులకు అదనపు బలం చేకూరుతుంది
సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాలు నిర్మించడం సులువవుతుంది.- నరేంద్ర మోదీ, ప్రధాని
11:27 October 03
"సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పనకు అటల్జీ సొరంగ మార్గం సరికొత్త బలం. ఇది ప్రపంచస్థాయి సరిహద్దు సొరంగ మార్గాలకు ఓ ఉదాహరణ. సరిహద్దు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్లు ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రాజెక్ట్‌లు ప్రణాళిక స్థాయిలోనే ఆగిపోయాయి."
- నరేంద్ర మోదీ, ప్రధాని
11:15 October 03
"ముందు అనుకున్న అంచనా వ్యయంతోనే అటల్జీ టన్నెల్ నిర్మాణాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పూర్తి చేసింది. సరిహద్దును రక్షించే సైనికులు, సరిహద్దు ప్రాంత ప్రజలకు ఈ సొరంగ మార్గం అంకితం."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
10:43 October 03
ప్రధాని నరేంద్ర మోదీ సొరంగ విశేషాలను అడిగి తెలుసుకుంటున్నారు.
10:26 October 03
అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
10:20 October 03
త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎమ్ఎమ్ నరవాణే అటల్ సొరంగ మార్గం దగ్గర ఉన్నారు.
09:16 October 03
అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మనాలీ చేరుకున్నారు. ఆయనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం స్వాగతం పలికారు.
09:06 October 03
అటల్ జీ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని లాహౌల్‌లో ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడతారు.
09:02 October 03
అటల్జీ సొరంగ మార్గాన్ని ప్రారంభించడానికి ప్రధాని మోదీ ఛండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
08:20 October 03
మోదీ చేతుల మీదుగా అటల్జీ సొరంగ మార్గం ప్రారంభం