తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ వర్చువల్ సమావేశం

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​తో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాధినేతలు పరస్పరం చర్చించనున్నారు. రవాణా అవసరాల కోసం సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అంశంపై ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

modi scott
మోదీ స్కాట్

By

Published : Jun 4, 2020, 5:32 AM IST

ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వాణిజ్య, రక్షణ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దేశాధినేతలు చర్చించనున్నారు.

కీలక ఒప్పందాలు

ఆన్​లైన్​ ద్వారా జరిగే ఈ సమావేశంలో ఇరుదేశాధినేతలు పలు కీలక ఒప్పందాలపై సంతకం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రవాణా అవసరాలకు సైనిక స్థావరాలను ఉపయోగించుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఓ దేశాధినేతతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

స్నేహపూర్వక సంబంధాలు

కరోనా విపత్తు ప్రతిస్పందన సహా ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

"ఇరుదేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విస్తృతమైన సంబంధాలపై సమీక్షించేందుకు వర్చువల్ సమావేశం నిర్వహించడం ఇరుదేశాలకు ఓ మంచి అవకాశం."

-విదేశీ వ్యవహారాల శాఖ

గత ఏడాదిన్నర కాలంలో ఇద్దరు నేతలు నాలుగు సార్లు సమావేశమయ్యారు. 2009లో ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. అప్పటి నుంచి కీలక రంగాల్లో భారత్, ఆస్ట్రేలియాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి.

ఇదీ చదవండి:సమోసా దౌత్యం: మోదీ కోసం వంట చేసిన ఆస్ట్రేలియా ప్రధాని

ABOUT THE AUTHOR

...view details