తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గ్రాండ్​ ఛాలెంజెస్​'లో మోదీ ఉపన్యాసం - narendra modi news

సోమవారం ప్రారంభమయ్యే 'గ్రాండ్ ఛాలెంజెస్' వార్షిక సమావేశంలో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా నేపథ్యంలో తొలిసారి ఈ కార్యక్రమాన్ని వర్చువల్​గా నిర్వహిస్తున్నారు.

PM Modi to deliver keynote address at Grand Challenges Annual Meeting on Monday
గ్రాండ్​ ఛాలెంజెస్​ వార్షిక సమావేశంలో మోదీ కీలకోపన్యాసం

By

Published : Oct 17, 2020, 8:50 PM IST

'గ్రాండ్​ ఛాలెంజెస్' వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇవ్వనున్నారు. అక్టోబర్​ 19 నుంచి 21 వరకు జరిగే ఈ సదస్సును కరోనా నేపథ్యంలో వర్చువల్​గా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం మోదీ ప్రసంగిస్తారు.

అంతర్జాతీయ ఆవిష్కరణలతో ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న అతిపెద్ద సవాళ్లను పరిష్కరించేందుకు.. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం గత 15ఏళ్లుగా సహకారం అందిస్తోందని ప్రధాని కార్యాలయం తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో.. విధానకర్తలు, శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కానున్నారు.

ఈ వార్షిక సమావేశాన్ని బిల్​ అండ్ మెలిండా గేట్స్​ ఫౌండేషన్​, శాస్త్ర సాంకేతిక శాఖ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్​, గ్రాండ్ ఛాలెంజెస్ కెనడా, యునైటెడ్​ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్​మెంట్ అండ్ వెల్​కం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

కరోనా అనంతరం సుస్థిర అభివృద్ధి సాధించేందుకు అవసరమైన కీలక అంశాల గురించి ఈ వేదికపై చర్చించనున్నారు. ఇందుకు 40 దేశాలకు చెందిన 1600 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details