తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇండియా గ్లోబల్​ వీక్​-2020లో మోదీ ప్రసంగం

బ్రిటన్​లో జులై 9 (నేడు) నుంచి జరిగే ఇండియా గ్లోబల్ వీక్​-2020 ప్రారంభ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్​లో పెట్టుబడుల అవకాశాల గురించి వ్యాపారవేత్తలకు ఈ వేదికగా వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ హాజరుకానున్నట్లు నిర్వహకులు తెలిపారు.

PM Modi to deliver inaugural address at India Global Week 2020 on Thursday
ఇండియా గ్లోబల్​ వీక్​-2020లో మోదీ ప్రసంగం

By

Published : Jul 9, 2020, 5:31 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రపంచస్థాయి వేదికపై ప్రసంగించనున్నారు. బ్రిటన్​లో నిర్వహించనున్న 'ఇండియా గ్లోబల్ వీక్- 2020' కార్యక్రమంలో భాగంగా వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల అంశంపై మాట్లాడనున్నారు.

భారత్​కు సంబంధించినంత వరకు ప్రపంచీకరణ విషయంలో అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమంగా పేర్కొంటున్న 'ఇండియా గ్లోబల్ వీక్'​లో ప్రధాని మోదీ ఆన్​లైన్ మాధ్యమం ద్వారా పాల్గొననున్నారు. భారత్​లో ఉన్న తయారీ, పెట్టుబడి అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరించనున్నారు. జులై 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

'కొవిడ్ కోరల నుంచి ప్రపంచం బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో భారత్​.. తనకున్న అపార నైపుణ్య వనరులు, సాంకేతిక శక్తిసామర్థ్యాలు, బలమైన నాయకత్వంతో ప్రపంచ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధానమంత్రి ఇచ్చే సందేశం ఇండియా గ్లోబల్ వీక్ ఇతివృత్తమైన 'బీ ది రివైవల్: ఇండియా అండ్ బెటర్ న్యూ వరల్డ్'లో ప్రతిధ్వనిస్తుంది.'

-మనోజ్ లడ్వా, ఇండియా ఐఎన్​సీ వార్తా సంస్థ సీఈఓ, కార్యక్రమ నిర్వహకులు

కరోనా నేపథ్యంలో సమావేశాలను పూర్తిగా ఆన్​లైన్​లోనే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఎస్​ జయ్​శంకర్, పీయుష్ గోయెల్, హర్​దీప్ సింగ్​ పూరీ, రవిశంకర్ ప్రసాద్, మహేంద్ర నాథ్ పాండే హాజరుకానున్నారు.

'ప్రిన్స్' ప్రత్యేకం

బ్రిటన్​ తరఫున ప్రిన్స్ ఛార్లెస్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్, హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, వైద్య శాఖ కార్యదర్శి మాట్ హాన్​కాక్, అంతర్జాతీయ వాణిజ్య సెక్రెటరీ లిజ్ ట్రస్.. ఆ దేశ ప్రభుత్వం తరఫున కార్యక్రమానికి హాజరవనున్నారు.

విస్తృత సమావేశాలు

భారత్​- యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలతో ప్రత్యేకమైన సెషన్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జులై 9 నుంచి 11 మధ్య జరిగే ఈ సమావేశాల్లో భౌగోళిక రాజకీయాలు, వ్యాపారం, బ్యాంకింగ్- ఫైనాన్స్, రక్షణ రంగం, సెక్యురిటీ, సంస్కృతి వంటి విస్తృతమైన అంశాలపై అధికారులు చర్చించనున్నట్లు ఇండియా ఐఎన్​సీ గ్రూప్ వెల్లడించింది. మొత్తం 75 సెషన్లు జరగనున్నట్లు తెలిపింది.

ప్రత్యేక చర్చ

భారత సంతతికి చెందిన హాలీవుడ్ నటుడు కునాల్ నయ్యర్- ఈశా ఫౌండేషన్ స్థాపకులు సద్గురు సహా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్- జర్నలిస్ట్ బార్కా దత్​ల మధ్య ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ఉంటాయని నిర్వహకులు వెల్లడించారు.

ఇదీ చదవండి:సరిహద్దులో శాంతి స్థాపన దిశగా భారత్-చైనా!

ABOUT THE AUTHOR

...view details