ఈ నెల 20న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కానుంది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య, ఆర్థిక, శ్రామిక సంస్కరణలు సహా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. గత సమావేశంలో ఎజెండా అంశాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించి.. భవిష్యత్ అభివృద్ధి కార్యకలాపాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
ఈనెల 20న నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ! - నీతి ఆయోగ్ పాలక మండలి తాజా సమావేశం
ఫిబ్రవరి 20న జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఈ భేటీలో ఆరోగ్య, ఆర్థిక, శ్రామిక సంస్కరణలు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఈ నెల 20న మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ!
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సహా సీనియర్ ప్రభుత్వాధికారులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రధాని నీతి ఆయోగ్ ఛైర్మన్గా ఉంటారు. నీతి ఆయోగ్ పాలక మండలి క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. అయితే కరోనా కారణంగా గతేడాది భేటీ కాలేదు.
ఇదీ చూడండి:సాగు చట్టాలపై విపక్షాల నిరసన- లోక్సభ వాయిదా