తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

సీఏఏ, ఎన్​ఆర్​సీలపై తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగిన అసోంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. కోక్రాజర్​లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బోడో శాంతి ఒప్పందం విజయోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు.

By

Published : Feb 7, 2020, 5:36 AM IST

Updated : Feb 29, 2020, 11:48 AM IST

modi in assam
అస్సాంలో ప్రధాని మోడీ పర్యటన

నేడు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు అసోంలో పర్యటించనున్నారు. కోక్రాజర్​లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు.​ బోడోలతో శాంతి ఒప్పందం చేసుకున్న సందర్భంగా జరిగే వేడుకలకు హాజరుకానున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమైన అనంతరం అసోంలో మోదీ తొలిసారి పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

"రేపు అసోం వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. కోక్రాజర్​ బహిరంగ సభలో ప్రసంగిస్తాను. దశాబ్దాల నుంచి వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించే బోడో ఒప్పంద విజయాన్ని నిర్వహించుకుంటాం. అభివృద్ధి, శాంతి స్థాపన దిశగా ఇది నూతన అధ్యాయం లిఖిస్తుంది."-నరేంద్ర మోదీ ట్వీట్

అసోంలో బోడో ఉద్యమం ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శాంతి స్థాపన కోసం జనవరి 27న నేషనల్​ డెమొక్రాటిక్ ఫ్రంట్​ ఆఫ్​ బోడోలాండ్​ (ఎన్​డీఎఫ్​బీ), బోడో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం అనంతరం ఎన్​డీఎఫ్​బీకి చెందిన 1615 మంది ఉద్యమకారులు తమ ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ విజయంపై ఏర్పాటుచేసిన వేడుకల్లోనే ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అసోం సంస్కృతిని ప్రతిబింబించేలా సభలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బాంబుల కలకలం

ప్రధాని పర్యటన నేపథ్యంలో గువాహటిలో బాంబుల కలకలం రేగింది. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఏడు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాన్​ఖైతీలో ఐదు, పాన్​బజార్, పల్టాన్ బజార్​ ప్రాంతంలో ఒక్కొక్కటి చొప్పున ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనల్లో ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిని యూఎల్​ఎఫ్​ఏ(ఐ) కేడర్ సభ్యుడుగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే మోదీ పర్యటన లక్ష్యంగానే ఈ బాంబులు పెట్టారా అన్న విషయమై స్పష్టత లేదని చెప్పారు. బాంబుల కలకలం నేపథ్యంలో రాజధాని గువాహటిలో ప్రధాని ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోరని స్పష్టం చేశారు అధికారులు.

ఇదీ చూడండి : బారాత్​లో 'లగే రహో కేజ్రీవాల్' గీతానికి చిందులు

Last Updated : Feb 29, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details