స్వచ్ఛ సర్వేక్షణ్-2020 ఫలితాలను ప్రధాని నరేంద్రమోదీ గురువారం ప్రకటించనున్నారు. దేశవ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్ ఫలితాలు ఇవి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటన చేసింది.
దేశంలోని 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లోని 1.87 కోట్ల మంది పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అందజేయనున్నారు.
లబ్ధిదారులతో మోదీ భేటీ..
'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్' ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులు, సఫాయి కార్మికులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్- 2020 ఫలితాల డాష్‌బోర్డును ఆవిష్కరించనున్నారు మోదీ.