తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో నేడు మోదీ ఎన్నికల ప్రచారం! - modi rally at jharkhand

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఝార్ఖండ్​లో ఎన్నికల ప్రచారానికి హాజరుకానున్నారు. కుంటి, జంషెడ్​పుర్​లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు మోదీ. జంషెడ్​​పుర్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రఘుబర్​దాస్ పోటీ చేస్తున్నారు.

modi
ఝార్ఖండ్​లో నేడు మోదీ ఎన్నికల ప్రచారం!

By

Published : Dec 3, 2019, 6:07 AM IST

Updated : Dec 3, 2019, 10:29 AM IST

ఝార్ఖండ్​లో నేడు మోదీ ఎన్నికల ప్రచారం!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఝార్ఖండ్​లో రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. కుంతి జిల్లాలోని బిర్సా కళాశాల వేదికగా ఉదయం 11 గంటలకు ఓ ర్యాలీలో పాల్గొంటారు మోదీ. అనంతరం జంషెడ్​పుర్​ స్టీల్ మైదానంలో జరిగే రెండో ర్యాలీకి ఆయన హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జంషెడ్​పుర్ తూర్పు స్థానం నుంచి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పోటీ చేయనున్నారు. రఘుబర్​కు పోటీగా ఆయన కేబినెట్​లో మాజీ సహచరిణి అయిన సరయూ రాయ్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని ప్రచారం చేయనున్నారు.

2014లో జంషెడ్​పుర్​ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సరయూ ఈ సారి రఘుబర్​తో పోటీ పడేందుకే తూర్పు డివిజన్ నుంచి నామినేషన్ వేశారని సమాచారం. రాయ్​కు మద్దతిస్తూ నితీశ్​కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు పలికింది. అయితే కాంగ్రెస్ పార్టీ గౌరవ్ వల్లభ్​ పంత్​ను ఈ స్థానం నుంచి బరిలో దింపింది.

ఝార్ఖండ్​లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రఘుబర్ దాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి రెండో దఫాలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 20న అన్ని దఫాల పోలింగ్ ముగుస్తోంది. 23వ తేదిన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి: కర్ణాటకీయం 2.0: చెలిమికి హస్తం సై-యోచనలో జేడీఎస్

Last Updated : Dec 3, 2019, 10:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details