తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ - ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల జాబితా

ప్రపంచంలో అత్యంత ఆరాధ్యులైన పురుషుల జాబితాలో ప్రధాని మోదీకి నాలుగో స్థానం దక్కింది. మోదీతో పాటు భారత్​ నుంచి అమితాబ్​ బచ్చన్​, కోహ్లి, షారుఖ్​ ఖాన్​లకు ఈ జాబితాలో చోటు దక్కింది.

PM Modi stands fourth in world's most admired men list
ప్రపంచ ఆరాధ్య వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ

By

Published : Sep 27, 2020, 6:17 AM IST

ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన 20 మంది పురుషుల జాబితాలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నాలుగో స్థానం దక్కింది. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ (14వ స్థానం), భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (16వ స్థానం), బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (17వ స్థానం) కూడా ఈ జాబితాలో ఉన్నారు. 42 దేశాల్లో సర్వే నిర్వహించిన 'యువ్‌గవ్' సంస్థ దీన్ని తయారుచేసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం బిల్‌ గేట్స్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌద్ధ మత గురువు దలైలామా (8వ స్థానం), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (12), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (15), క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (18వ స్థానం)లకూ చోటు దక్కింది. భారత్‌లో అత్యంత ఆరాధ్య పురుషుల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రతన్‌ టాటా, మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని ఉన్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ 7వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 9వ స్థానంలో నిలిచారు.

ఇదీ చూడండి:-'అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల' జాబితాలో మోదీ

ABOUT THE AUTHOR

...view details